NTV Telugu Site icon

Project K: యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో అమితాబ్ కి ప్రమాదం…

Amitabh

Amitabh

ప్రతి ఆదివారం తన ఇంటి(జల్సా) ముందు అభిమానులని కలుసుకునే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ ఆదివారం మాత్రం బయటకి రాలేదు. తాను కలవలేను, మీరు ఇంటి దగ్గరికి రాకండి అంటూ అమితాబ్ తన బ్లాగ్ లో రాసాడు. ఎన్నో ఏళ్లుగా ‘జల్సా’ ముందు ప్రతి వీకెండ్ అభిమానులని కలుసుకునే అమితాబ్, ఈసారి ఫాన్స్ కి కలవలేకపోవడానికి కారణం ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’. దీపిక పదుకోణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12 రిలీజ్ కానున్న ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ ని నాగ్ అశ్విన్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించే సమయంలో జరిగిన ప్రమాదంలో అమితాబ్ కి గాయాలయ్యాయి.

Read Also: Kushi: లవ్ స్టొరీ కదా సార్… పీటర్ హెయిన్స్ తో ఫైట్ ఎందుకు?

పక్కటెమెకలకు గాయాలవ్వడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసి అమితాబ్ కి CT స్కాన్ చేయించి హైదరాబాద్ లో AIG హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత ముంబై వెళ్లి పోయిన అమితాబ్, ప్రస్తుతం తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ కారణంగానే తను ఫాన్స్ ని కలవలేకపోతున్నాను అని అమితాబ్ రివీల్ చేశాడు. ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్ కి యాక్సిడెంట్ జరిగిన కారణంగా ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ లో ఏమైనా డిలే ఉంటుందేమో అనే చర్చ సోషల్ మీడియాలో మొదలయ్యింది.

ఇదిలా ఉంటే తమ షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాజెక్ట్ కే షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం అని వచ్చిన వార్తలు నిజం కాదు. మూడు రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకొని అమితాబ్ ముంబై వెళ్ళారు. మా షూటింగ్ లో ఎటువంటి ప్రమాదం జరగలేదు అని ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ రెస్పాండ్ అయ్యారు. స్వయంగా అమితాబ్ బచ్చన్ బ్లాగ్ లో రాస్తూ ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో ప్రమాదం జరిగింది అని రాశారు. అశ్వినీ దత్ ఏమో మా సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగలేదు అంటున్నాడు. మరి ఈ రెండు మాటల్లో ఏది నిజమో చూడాలి.

Show comments