Bichagadu set for re-release in cinemas for Vinayaka Chaturthi on Sep 15th: తమిళ నటుడు విజయ్ ఆంటోనికి హీరోగా తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ‘బిచ్చగాడు’. 2016లో విడుదలైన ‘పిచ్చైకారన్’ అనే తమిళ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో డబ్ చేశారు. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. భారీ విజయం సాధించడంతో తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్‌తో విడుదల చేశాడు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విజయ్ ఆంటోనీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాదు మార్కెట్ కూడా ఏర్పడేలా చేసింది. ఇక సంచలన విజయాన్ని అందుకున్న ‘బిచ్చగాడు’ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.
Kushitha Kallapu: చీరకట్టులో కనికట్టు చేస్తున్న బజ్జీల పాప కుషిత
రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారి వ్రతం ఆచరించడం ఈ సినిమా కథాంశం. ఇక ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘బిచ్చగాడు -2’ రీసెంట్ గా విడుదలైంది స్వయంగా హీరో విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్ పై ఆయనే స్వయంగా నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేశారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.