Bhola Shankar: తెలుగులో పోటీ లేదు అయినా ‘భోళా శంకర్’కి పెద్ద పరీక్షే?
NTV WebDesk
Bholaa Shankar to face tough competition from Animal and Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా తమిళ ‘వేదాలం’ను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకుంటున్న మెహర్ రమేష్ ఈ సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, కేఎస్ రామారావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్, ఆమె ప్రియుడి పాత్రలో అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయడం దాదాపు ఖరారు అయిపోయింది. అయితే ఈ సినిమాకు కొన్ని తెలుగు సినిమాలు పోటీ దిగే సూచనలు రాగా వీరే అడిగారో లేక వారు వెనక్కి తగ్గారో కానీ ఈ సినిమాకు తెలుగు నుంచి పోటీ అయితే లేదు.
కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఇతర భాషల నుంచి డబ్ అయి తెలుగులో రిలీజ్ అవుతూ ఉండడంతో సినిమా మీద ప్రెజర్ పడుతోంది. ఆ రెండు సినిమాలు హిందీ నుంచి యానిమల్, తమిళం నుంచి జైలర్. నిజానికి ఖైదీ నెం 150 తరువాత వాల్తేరు వీరయ్యతో చిరు సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఆ టెంపోను ఇప్పుడు క్యారీ చేయాల్సి ఉంది. కానీ మెహర్ రమేష్ డైరెక్షన్ కావడం ఆల్రెడీ తెలిసిన కథే కావడంతో సినిమా మీద పెద్దగా అంచనాలు అయితే లేవు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో హిందీలో తెరకెక్కిన యానిమల్, తమిళంలో తెరకెక్కిన రజనీకాంత్ జైలర్ సినిమాలు అదే రోజు రిలీజ్ అవుతూ ఉండడంతో సినిమాకు ఖచ్చితంగా అవి పోటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ అంతా సినిమా మీద ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇక జైలర్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తూ ఉండగా తమిళ స్టార్ హీరో రజినీకాంత్ నటిస్తున్నారు. ఆయనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆ ఎఫెక్ట్ కూడా భోళా శంకర్ మీద పడే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఈ పోటీని భోళా శంకరుడు ఎలా తట్టుకుంటారు అనేది.