Site icon NTV Telugu

Bholaa Shankar: రూమర్స్ కు ‘భోళాశంకర్’ టీమ్ చెక్!

New Project (6)

New Project (6)

 

మెగాస్టార్ చిరంజీవి తాజాచిత్రం ‘ఆచార్య’ పరాజయం పాలు కావడంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై చిరంజీవి పునరాలోచనలో పడ్డారనే వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకీ కుడుములతో చిరంజీవి చేయాలనుకున్న సినిమా అటకెక్కేసిందని కొందరు అంటే, మెహర్ రమేశ్ రూపొందిస్తున్న ‘భోళా శంకర్’దీ అదే పరిస్థితి అని మరికొందరు రూమర్స్ సృష్టించారు. అయితే వాటిని ఇన్ డైరెక్ట్ గా ఖండిస్తూ చిత్ర నిర్మాత ఓ వార్తను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కు సిద్ధమౌతోందని, జూన్ 21 నుండి అది మొదలవుతుందని చెప్పారు. ‘మెగావైబ్ తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ కూడా చేసింది.

మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రాగా, ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి మెగా స్టైలిష్ గా కనిపించి అలరించారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ ఏడాది చివర్లో ‘భోళా శంకర్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version