Site icon NTV Telugu

Bhola Shankar Trailer: చిరు నట విశ్వరూపం..

Bhoal

Bhoal

Bhola Shankar Trailer: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేషే చెల్లెలిగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చిరు మాస్ మ్యానియాను మెహర్ రమేష్ అద్భుతంగా చూపించాడు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఉంది.

కలకత్తా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కలకత్తాలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈ కిడ్నాప్ కేసులు పోలీసులకు సవాల్ గా మారతాయి. కానీ, ఆ నిందితులను పట్టుకోవడం పోలీసుల వలన కాకపోవడంతో గ్యాంగ్ స్టర్ గా ఉన్న భోళా హెల్ప్ తీసుకుంటారు పోలీసులు. ఇక అమ్మాయిల విషయం కావడంతో భోళా సైతం పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా.. ఆ బ్లాక్ మాఫియాకు భోళా విలన్ గా మారతాడు. ఈ నేపథ్యంలోనే భోళాను ఆపడానికి అతని చెల్లిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి భోళా చెల్లిని కాపాడుకున్నాడా.. ? అమ్మాయిల కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు.. ? భోళా ఆ మాఫియాను ఆపగలిగాడా.. ? అనేది సినిమాలో చూడాలి. చిరు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ దుమ్ము దులిపేశాడు. వన్ మ్యాన్ షో చూపించేశాడు. ఇక చిరు.. రాజశేఖర్ లా, పవన్ కళ్యాణ్ లా నటించినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఆగస్టు 11 న భోళా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version