Bhola Shankar to be released in Hindi on August 25th: చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్లుగా మెహర్ రమేష్ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటించగా ఆమె ప్రియుడి పాత్రలో సుశాంత్ నటించారు. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ మాత్రం వసూళ్లు రాబట్టిన పోయినా ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసేందుకు సినిమా టీం సిద్ధమైంది.
Bhagavanth kesari: ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్
వాస్తవానికి ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు సినిమా రిజల్ట్ దారుణంగా ఉండడంతో హిందీలో రిలీజ్ చేయరేమో అనుకున్నారు. కానీ హిందీలో ఈనెల 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు హిందీ రైట్స్ కొనుక్కున్న సంస్థ అధికారికంగా ప్రకటించడమే గాక ఒక హిందీ టీజర్ కూడా ఈరోజు రిలీజ్ చేసింది. నిజానికి గతంలో ఇక్కడ ఏమాత్రం ఆకట్టుకొని సినిమాలను సైతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ అక్కడి ప్రేక్షకులు చూసి ఆదరించారు. అలాంటి క్రమంలోనే భోళా శంకర్ సినిమాని హిందీలో ఆదరిస్తారా లేక తెలుగు ప్రేక్షకులు పక్కన పెట్టినట్టే పక్కన పెడతారా అనేది కాలమే నిర్ణయించాలి.