Site icon NTV Telugu

Bheemla Nayak Trailer: ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్క‌డ‌…

ఎప్ప‌టినుంచో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భీమ్లా నాయ‌క్ సినిమా ట్రైలర్ వ‌చ్చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్, ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న ఈ సినిమాపై మొద‌టి నుంచి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన గ్లింపేజ్‌, సాంగ్స్ అక‌ట్టుకోవ‌డంతో సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియోట్ అయింది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్‌ప్లే వ‌హించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 25 న విడుద‌ల కాబోతున్న‌ది. కొద్ది సేప‌టి క్రిత‌మే విడుద‌లైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆద్భుత‌మైన విజువ‌ల్స్‌తో నిండిపోయింది. భీమ్లానాయ‌క్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్క‌డ అంటూ రానా డైలాగ్ ట్రైల‌ర్‌ను ముగించారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రైల‌ర్ వైర‌ల్ అవుతున్న‌ది.

Exit mobile version