NTV Telugu Site icon

Mahesh Babu: సర్కారు వారి పాట సినిమాలో ‘భీమ్లా నాయక్’

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్‌బాబు ఖాతాలో మరో హిట్ పడింది. సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మహేష్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. తొలిరోజు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. ఈ సినిమా మహేష్ అభిమానులతో పాటు పవర్‌స్టార్ అభిమానులకు కూడా కిక్కిస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్‌లోని ఓ పాట వినపడుతుంది.

Harish Shankar: మైత్రీ మూవీ మేకర్స్ దిష్టి తీయించుకోవాలి

సర్కారు వారి పాట సినిమాలో పదే పదే సుబ్బరాజుకు హీరో మహేష్‌బాబు కాల్ చేస్తుంటాడు. దీంతో సుబ్బరాజు ఫోన్ మోగినప్పుడల్లా ‘లాలా.. భీమ్లా’ అనే రింగ్ టోన్ వినిపిస్తుంది. ఈ రింగ్ టోన్ వినిపించినప్పుడల్లా థియేటర్లలో పవర్ స్టార్ అభిమానులు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. దీంతో సర్కారు వారి పాట ప్రదర్శితం అవుతున్న థియేటర్లలో మహేష్ అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానుల కోలాహలం కూడా కనిపిస్తోంది. అలాగే సినిమా ప్రారంభంలో మహేష్ చిన్నతనంలో టాటూ వేయించుకునే సమయంలో.. ఏ పచ్చబొట్టు కావాలి అని ఓ ముసలావిడ అడుగుతుంది. కృష్ణది కావాలా.. చిరంజీవిది కావాలా అని ప్రశ్నిస్తుంది. చిరంజీవి పేరు వినిపించడంతో ఆ సమయంలో కూడా మెగాస్టార్ అభిమానులు విజిల్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా సర్కారు వారి పాట సినిమాలో మహేష్ అందం, యాటిట్యూడ్, డైలాగులు, ఫైట్లు, డ్యాన్సులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.