పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈసారి కూడా నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ‘భీమ్లా నాయక్’ ఈసారి కూడా వాయిదా పడడం ఖాయమని తెలుస్తోంది. వాస్తవానికి ఇలా అనుకోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. కరోనా కారణంగా వెనుకబడిన సినిమాలన్నీ ఫిబ్రవరిలో రిలీజ్ గేట్లను ప్రకటించాయి.
ఫిబ్రవరి 11 న ‘డీజే టిల్లు’ విడుదల అవుతుండగా.. ఫిబ్రవరి 25 న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ విడుదలకు సిద్దమయ్యింది. అదే రోజు భీమ్లా నాయక్ కి పోటీగా ఈ సినిమాను దింపారు అనుకున్నా.. ఇప్పటివరకు రిలీజ్ డేట్ పై ‘భీమ్లా నాయక్’ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది లేదు. దీంతో ఈసారి కూడా ఈ సినిమా వాయిదా పడింది కన్ఫర్మ్ అని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈసారి కూడా పవన్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.. మరి మేకర్స్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ పై ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
