పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల వాయిదా పడుతుంది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా మేకర్స్ మాత్రం అంతే గట్టిగా తగ్గేదే లే అంటూ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సంక్రాంతి రేసుకు సిద్ధమంటూ సినిమా నిర్మాత “భీమ్లా నాయక్” ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 12న రానుందని స్వయంగా ప్రకటించారు. దీంతో కొన్ని రోజులు ఆ రూమర్స్ ఆగిపోయాయి. తాజాగా మరోమారు సంక్రాంతి రేసులో ‘భీమ్లా నాయక్’ ఉండకపోవచ్చు అంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మేకర్స్ పవన్ ను సినిమా వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేసినట్టు వార్తలు విన్పిస్తున్నాయి.
Read Also :
దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు డివివి దానయ్య, నాగ వంశీ ఇదే విషయాన్ని మీడియాకు తెలియజేయబోతున్నారని బలంగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ఏమిటంటే మేకర్స్ 2022 ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. అదే సమయంలో ఆ డేట్ కు విడుదల కావాల్సిన ‘ఆచార్య’ మార్చి 25కు పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ‘ఆచార్య’లో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలనీ భావిస్తున్నారట టీమ్. అయితే ఈ రెండు సినిమాలు వాయిదా పడతాయా ? లేదా ? అన్న విషయంపై మేకర్స్ స్పందించలేదు. ఈ రూమర్స్ పై మేకర్స్ స్పందిస్తేనే ‘భీమ్లా నాయక్’ విడుదలపై క్లారిటీ వస్తుంది.
