Bheemla Nayak: పవర్ తుఫాన్ హెచ్చరిక.. కొత్త ట్రైలర్ విడుదల

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా యూనిట్ మరో ట్రీట్ అందించింది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసిన యూనిట్.. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద మరో కొత్త ట్రైలర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. మంత్రి కేటీఆర్ ఈ ట్రైలర్ విడుదల చేశారు. తొలి ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా.. ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

కొత్త ట్రైల‌ర్ గూస్ బంప్స్ తెప్పించే సీన్ల‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ ట్రైలర్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ ట్రైలర్‌లో తమన్ బీజీఎం కూడా అదరగొడుతోంది. తాజాగా ట్రైలర్ విడుదల నేపథ్యంలో ఈనెల 25న థియేటర్లలో తమన్ మ్యూజిక్ దద్దరిల్లుతుందని అభిమానులు భావిస్తున్నారు.