ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్” ఫీవర్ నడుస్తోంది. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా నేడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిక్కిరిసిన జనాలతో థియేటర్లలో మొదటి షోకే హౌస్ ఫుల్ బోర్డు పడింది. ఇప్పటికే ప్రీమియర్లు చూసిన ప్రేక్షకుల నుంచి సినిమాకు సానుకూల స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ మాత్రం మరో వారం వాయిదా పడింది. “భీమ్లా నాయక్” నిర్మాతలు సినిమాను ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. B4U మోషన్ పిక్చర్స్ ఈ చిత్రం హిందీ హక్కులను సొంతం చేసుకుంది.
Read Also : Bheemla Nayak : నిరాశలో పవన్ ఫ్యాన్స్… హీరోయిన్ కు షాక్
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా నిర్మాతలు “భీమ్లా నాయక్” హిందీ విడుదలను ఒక వారం వాయిదా వేశారు. “భీమ్లా నాయక్” ట్రైలర్ కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించి, అక్కడ కూడా విడుదల చేయనున్నారు మేకర్స్. హిందీలో ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక “భీమ్లా నాయక్” మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. పవన్ కళ్యాణ్, రానా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్.