ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘భీమ్లా నాయక్’ వాయిదా పాడడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక రీమేక్ ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ పవన్ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ని టాలీవుడ్ అవసరానికి వాడుకొంటుంది. ఆయనకు చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు ఆయనే అవసరమయ్యారు. అవసరం కోసం పవన్ దగ్గరకు వచ్చారా..? ‘భీమ్లా నాయక్’ వారు అడగడంతోనే వాయిదా వేశారని మేము అర్ధం చేసుకుంటాం.. కానీ పవన్ కళ్యాణ్ సినిమా కి సమస్య వస్తే ఈ నిర్మాతలు వస్తారా…??? అని అభిమానులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
తాజాగా ఒక నెటిజన్ ఈ విషయమై బండ్ల గణేష్ ని హెల్ప్ చేయమని ట్విట్టర్లో అడిగాడు. దానికి బండ్ల గణేష్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “మేము అర్థం చేసుకుంటాం …కానీ పవన్ కళ్యాణ్ సినిమా కి సమస్య వస్తే ఈ నిర్మతలు వస్తారా…??? బండ్లన్న నువ్వు అడగవచ్చు గా మన తరుపున అని దిల్ రాజును , డీవీవీ దానయ్యను, మిగతా ప్రొడక్షన్ హౌస్ లను ట్యాగ్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ “న్యాయానికి ధర్మానికి రోజులు లేవు బ్రదర్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
