NTV Telugu Site icon

Sonakshi : టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ స్టార్ భామ

Sonakshi Sinha

Sonakshi Sinha

ఫస్ట్ సినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కళంక్, మిషన్ మంగళ్, దబాంగ్ త్రీ సెటిల్ ఫెర్మామెన్స్‌తో మెస్మరైజ్ చేసిన బ్యూటీ ఆ తర్వాత ఎక్కువగా ఓటీటీ సినిమాలకు పరిమితమైంది. హీరా మండి, కకుడాతో లాస్ట్ ఇయర్ పలకరించిన అమ్మడు అదే ఏడాది హడావుడిగా పేరెంట్స్ తెలియకుండా పెళ్లి పీటలు ఎక్కింది.

Also Read : Mythri Movies : మరో కోలీవుడ్ హీరోతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఫిక్స్

పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది శృతఘ్ణ సిన్హా డాటర్. ఇదే టైంలో తోటి నటులంతా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తుంటే తానెందుకు ట్రై చేయకూడదు అని ఫిక్సైంది. ఆ ట్రయల్స్ వర్కౌట్ అయినట్లే కనిపిస్తున్నాయి. సుధీర్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్ జటాధరలో సోనాక్షి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు వెంకట్ కళ్యాణ్ ఆమెను అప్రోచై కథ వినిపించినట్లు టాక్. స్టోరీకి టెంప్ట్ అయిన ఈ బ్యూటీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మార్చి 8 నుండి జటాదర సెట్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉండబోతుందట. ఇప్పటికే సుధీర్ బాబు కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. వర్షం రీమేక్ బాఘీలో విలన్ రోల్ పోషించాడు సుధీర్. హరోం హరతో ఓకే అనిపించుకున్న సుధీర్ నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేశాడని టాక్. ఈ నేపథ్యంలోనే సోనాక్షిని అప్రోచ్ అయ్యాడట డైరెక్టర్. సోనాక్షి గ్రీన్ ఇస్తే సుధీర్ బాబు సినిమాకు అదనపు ఆకర్షణ తోడైనట్టే అని చెప్పాలి.