Site icon NTV Telugu

Bellamkonda : భైరవం ఫిబ్రవరి రిలిజ్ డేట్ లాక్..?

Bhairavam

Bhairavam

తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ లీడ్ రోల్స్ లో విజయ్‌ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.  బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్‌ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.

Also Read : Janhvi Kapoor : లేటెస్ట్ ఫొటోస్ తో గిచ్చి గిచ్చి చంపుతోంది ‘జాన్వీ సుందరి’

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోని ముగ్గురు హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి గుర్తింపు లభించింది.  షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వాస్తవానికి సంక్రాంతి కానుకగా  జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ రానున్న పండుగకు మూడు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానుండడంతో వాటి మధ్యలో ఎందుకులే అని పోస్ట్ పోన్ చేసుకున్నారు. తాజగా అందుతున్న సమాచారం మేరకు భైరవం సినిమాను వచ్చే ఫిబ్రవరి 1న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోటీలో సినిమా లేకపోవడంతో ఆ డేట్ ను ఆలోచిస్తున్నారట మేకర్స్. ఆపై వచ్చేవారం తండేల్ వంటి బిగ్ బడ్జెట్ మూవీస్ ఉండడం. శివరాత్రికి రాబిన్ హుడ్ వంటి సినిమాలు రిలీజ్ ఉండడంతో ఫిబ్రవరి 1న రిలీజ్ కు యూనిట్ సుముఖంగా ఉందట. అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తుండగా హరి కె.వేదాంతం ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version