Site icon NTV Telugu

హీరోయిన్ గా భాగ్యశ్రీ కూతురు

‘ప్రేమపావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులోనూ నటించింది. తాజాగా ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కూతురు అవంతికకు సోషల్ మీడియాలో చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మ బాటలో సినిమా రంగ ప్రవేశం చేయబోతోందట. అయితే భాగ్యశ్రీ తన కూతురి తెలుగు సినిమా ద్వారా పరిచయం చేయబోతోంది. టాలీవుడ్ అయితే తనకి చక్కటి గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది.

బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా రూపొందబోయే కొత్త చిత్రంలో అతడితో రొమాన్స్ చేయనుంది భాగ్యశ్రీ కూతురు అవంతిక. సతీష్ వేగశ్న ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సోషల్ మీడియాలోనూ అవంతిక నటించి కొన్ని ప్రకటనలు చూసిన తర్వాత తను తమ సినిమాలో పాత్రకు సరిపోతుందని నిర్మాతలు భావించారట. మరి భాగ్యశ్రీ కూతురు హీరోయిన్ గా ఎంత వరకూ రాణిస్తుందో చూడాలి.

Exit mobile version