అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈరోజు హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో వరంగల్ గడ్డపై మాస్ జాతరకు రెడీ అవుతున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. ఈరోజు రాత్రి 8:16 నిమిషాలకి భగవంత్ కేసరి ట్రైలర్ బయటకి రానుంది. దాదాపు 2:45 నిడివితో భగవంత్ కేసరి ట్రైలర్ ని కట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా… అనిల్ రావిపూడి స్టైల్ లో ఫన్ డోస్ తో నిండి ఉంటుందా? లేక బాలయ్య స్టైల్ లో పవర్ ఫుల్ గా ఉంటుందా? ఈ రెండూ కాకుండా బాలయ్య స్టైల్ లో అనీల్ రావిపూడి సినిమా అవుతుందా అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఈ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే ట్రైలర్ బయటకి రావాల్సిందే.
ఈరోజు రాత్రికి ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంతక ముందు వదిలిన టీజర్ లో అయితే బాలయ్య పవర్ ఫుల్ గా కనిపిస్తూనే కొత్తగా ఉన్నాడు. టీజర్ లో చూపించిన అంతే కొత్తదనం ట్రైలర్ లో కూడా చూపిస్తే నందమూరి ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా వచ్చినట్లే. 2024 సంక్రాంతికి వీర సింహా రెడ్డిగా హిట్ అందుకున్న బాలయ్య… భగవంత్ కేసరి సినిమాతో దసరాకి కూడా హిట్టు కొట్టి… ఒకే ఏడాదిలో రెండు సూపర్ హిట్స్ కొట్టిన ఏకైక సీనియర్ హీరోగా హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికైతే భగవంత్ కేసరిపై అంచనాలు చాలా పాజిటివ్ గా ఉన్నాయి, ట్రైలర్ బాగుంటే ఈ అంచనాలు మరింత పెరుగుతాయి. ఆ ఎక్స్పెటెషన్స్ కి తగ్గట్లు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు బాలయ్య హ్యాట్రిక్ 100 క్రోర్స్ కొట్టడం పెద్దకష్టమేమీ కాకపోవచ్చు.
The Day is here🤘#BhagavanthKesari Trailer out Today @ 8:16 PM🔥
Launch Event begins from 5PM onwards⏳IN CINEMAS OCT 19th💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @shreyasgroup… pic.twitter.com/RjbPYj4dF8
— Shine Screens (@Shine_Screens) October 8, 2023