Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైనపోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 19 న భగవంత్ కేసరి రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 8 న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరగనుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Allu Arjun: ప్రభాస్, మహేష్ బాబు.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు
అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. బాలయ్య.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ఇక ఈసారి హ్యాట్రిక్ అందుకోవాలని బాలయ్య గట్టిగా ట్రై చేస్తున్నాడు. అందుకే తన యాక్షన్ ను కొద్దిగా పక్కన పెట్టి.. ఎమోషనల్ కథతో వస్తున్నాడు. ఇక బాలయ్యకు పోటీగా అక్టోబర్ 20 న టైగర్ నాగేశ్వరరావు దిగుతున్నాడు. రెండు స్టార్ సినిమాలే.. రెండు డిఫరెంట్ కథలే. మరి ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ టాక్ అందుకుంటుందో చూడాలి.
