Site icon NTV Telugu

Bhagavanth Kesari: 75 కోట్లు… బాలయ్య కెరీర్ లోనే భారీ ప్రీరిలీజ్ బిజినెస్

Bhagavanth Kesari

Bhagavanth Kesari

నటసింహం నందమూరి బాలకృష్ణకి ఉన్నంత క్రేజ్ ఏ సీనియర్ హీరోకి లేదు. జై బాలయ్య అనేది ఈ జనరేషన్ కి  స్లోగన్ ఫర్ సెలబ్రేషన్ లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు అందరికన్నా ముందు యూత్ థియేటర్స్ కి వెళ్లిపోతున్నారు. సింహా సినిమా నుంచి బాలయ్య మార్కెట్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా లెజెండ్ సినిమా బాలయ్య మళ్లీ టాప్ హీరోల రేస్ లోకి తెచ్చింది. ఇక అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. బాలయ్య అనే హీరో వంద కోట్ల కలెక్షన్స్ ని రాబడతాడని ట్రేడ్ వర్గాలు కలలో కూడా ఊహించి ఉండవు. అలాంటిది ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో ఏకంగా హ్యటిక్ హండ్రెడ్ క్రోర్ కొట్టడానికి బాలయ్య రెడీ అయ్యాడు. 

అనిల్ రావిపూడి సక్సస్ ట్రాక్, బాలయ్య హిట్ స్ట్రీక్, థమన్ థంపింగ్ మ్యూజిక్, ఫెస్టివల్ సీజన్ అన్నీ కలిసి భగవంత్ కేసరి సినిమాని మరో వంద కోట్ల ప్రాజెక్ట్ గా మారుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై ఈ రేంజ్ అంచనాలు ఉన్నాయి కాబట్టే ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక నంబర్స్ ని నమోదు చేస్తూ… భగవంత్ కేసరి 75కోట్ల ప్రీరిలీజ్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చేసింది. అఖండ సినిమా 54 కోట్ల బిజినెస్ చేయగా, వీరసింహారెడ్డి సినిమా 73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ రెండు సినిమాలు బయ్యర్స్ కి భారీగా ప్రాఫిట్స్ ఇచ్చాయి ఇప్పుడు భగవంత్ కేసరి కూడా అదే లిస్టులో యాడ్ అయ్యి బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ ప్రాజెక్ట్ అవుతుందేమో చూడాలి.

Exit mobile version