Bhagavanth Kesari: 75 కోట్లు… బాలయ్య కెరీర్ లోనే భారీ ప్రీరిలీజ్ బిజినెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణకి ఉన్నంత క్రేజ్ ఏ సీనియర్ హీరోకి లేదు. జై బాలయ్య అనేది ఈ జనరేషన్ కి స్లోగన్ ఫర్ సెలబ్రేషన్ లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు అందరికన్నా ముందు యూత్ థియేటర్స్ కి వెళ్లిపోతున్నారు. సింహా సినిమా నుంచి బాలయ్య మార్కెట్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా లెజెండ్ సినిమా బాలయ్య మళ్లీ టాప్ హీరోల రేస్ లోకి తెచ్చింది. ఇక అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. బాలయ్య అనే హీరో వంద కోట్ల కలెక్షన్స్ ని రాబడతాడని ట్రేడ్ వర్గాలు కలలో కూడా ఊహించి ఉండవు. అలాంటిది ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో ఏకంగా హ్యటిక్ హండ్రెడ్ క్రోర్ కొట్టడానికి బాలయ్య రెడీ అయ్యాడు.
అనిల్ రావిపూడి సక్సస్ ట్రాక్, బాలయ్య హిట్ స్ట్రీక్, థమన్ థంపింగ్ మ్యూజిక్, ఫెస్టివల్ సీజన్ అన్నీ కలిసి భగవంత్ కేసరి సినిమాని మరో వంద కోట్ల ప్రాజెక్ట్ గా మారుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై ఈ రేంజ్ అంచనాలు ఉన్నాయి కాబట్టే ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక నంబర్స్ ని నమోదు చేస్తూ… భగవంత్ కేసరి 75కోట్ల ప్రీరిలీజ్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చేసింది. అఖండ సినిమా 54 కోట్ల బిజినెస్ చేయగా, వీరసింహారెడ్డి సినిమా 73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ రెండు సినిమాలు బయ్యర్స్ కి భారీగా ప్రాఫిట్స్ ఇచ్చాయి ఇప్పుడు భగవంత్ కేసరి కూడా అదే లిస్టులో యాడ్ అయ్యి బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ ప్రాజెక్ట్ అవుతుందేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!