Bhaag Saale: మత్తు వదలరా సినిమాతో శ్రీ సింహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత మనోడి రేంజ్ మారిపోతుందని అనుకున్నారు. కానీ, ఆ సినిమా తరువాత శ్రీసింహాను జనాలు మర్చిపోయారు అనే చెప్పాలి. తెల్లారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అసలు శ్రీసింహా ఈ సినిమాలు తీశాడా అనే అనుమానం కూడా వచ్చింది. అయితే హిట్ కొట్టందే అస్సలు వెనక్కి తగ్గేదేలే అంటున్నాడు కీరవాణి చిన్న కొడుకు. ఇక తాజాగా శ్రీసింహా కోడూరి హీరోగా రాబోతున్న సినిమా ‘భాగ్ సాలే’. నేహా సోలంకి నాయికగా నటించిన ఈ సినిమాకు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వం వహించారు.
BoyapatiSuriya: రోలెక్స్ నట విశ్వ రూపం.. రక్త చరిత్రే..?
క్రైమ్ కామెడీ గా తెరకెక్కింది ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ‘వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే’ను యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ పరిచయం చేయబోతున్నారు. ఆయన వాయిస్ ఓవర్ తో ‘భాగ్ సాలే’ చిత్ర నేపథ్యాన్ని వివరించబోతున్నారు. కథలో హీరో ఎందుకు ఛేజింగ్ చేస్తున్నాడు?, దాని వెనకున్న కారణాలు ఏమిటన్నది సిద్దు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాపైనే సింహా అన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈసారైనా ఈ హీరో అభిమానుల మత్తు వదిలిస్తాడా..? లేక ఈ కుర్రాడే ఆ మత్తు వదలరా అనే హిట్ మత్తులోనే ఉంటాడా.. ? అనేది చూడాలి.