Bellamkonda Srinivas: సూరి సినిమా రీమేక్.. ఆ డైరెక్టర్ కి బాధ్యతలు!

  • సినిమా రీమేక్.. ఆ డైరెక్టర్ కి బాధ్యతలు
  • తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సూరి గరుడన్ అనే సినిమాని చూసి సాయి శ్రీనివాస్ ఇంప్రెస్
  • స్క్రిప్ట్ మీద పనిచేయమని విజయ కనకమేడలకు సూచనలు
  • ప్రస్తుతం శేఖర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమా చేస్తున్నాడు
Bellamkonda Srinivas

Bellamkonda Srinivas

Bellamkonda Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో అల్లుడు శ్రీను అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కౌట్ కాలేదు. రాక్షసుడు హిట్ అయిన తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయిన శ్రీనివాస్ అక్కడ చత్రపతి సినిమా రీమేక్ చేశాడు. అయితే ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలవడంతో మళ్లీ టాలీవుడ్ కి వచ్చేసి వరుస సినిమాలో లైన్లో పెట్టాడు. ప్రస్తుతానికి ఆయన చేస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఒక్కో రోజు ఒక్కో సినిమా షూటింగ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయనతో నాంది సినిమా డైరెక్టర్ విజయ కనకమేడల ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కథ చెబితే సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో హోల్డ్ లో పడింది.

Also Read: Dil Raju: ఆ పని చేయండి ప్లీజ్.. దిల్ రాజుకు మెగా ఫ్యాన్స్ విజ్ఞప్తి

అయితే ఈ మధ్యకాలంలో తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సూరి గరుడన్ అనే సినిమాని చూసి సాయి శ్రీనివాస్ ఇంప్రెస్ అయ్యాడు. ఈ నేపద్యంలో ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతానికి ఆ స్క్రిప్ట్ మీద పనిచేయమని విజయ కనకమేడలకు సూచనలు ఇవ్వడంతో ఆయన ప్రస్తుతానికి అదే పనిలో ఉన్నాడు. ఆయన ఫైనల్ నేరేషన్ ఇచ్చిన తర్వాత సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఆ తర్వాత అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శేఖర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు, కౌశిక్ కిష్కిందపురి, లుధీర్ హైంధవ సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.