NTV Telugu Site icon

Bellamkonda Srinivas: చరిత్ర సృష్టించిన బెల్లంకొండ.. వరల్డ్ రికార్డ్ సొంతం

Bellamkonda World Record

Bellamkonda World Record

Bellamkonda Srinivas Creates World Record With Jaya Janaki Nayaka: బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా ఆరు పరాజయాలు చవిచూసి ఉండొచ్చు.. కేవలం ఒక్క హిట్ మాత్రమే దక్కి ఉండొచ్చు.. కానీ స్టార్ హీరోలకి కూడా సాధ్యంకాని ఓ అరుదైన రికార్డ్‌ని మాత్రం నమోదు చేశాడు. అది కూడా ఏదో మామూలు రికార్డ్ కాదు, ఏకంగా వరల్డ్ రికార్డ్. తన ‘జయ జానకి నాయక’ సినిమాతో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ సినిమాను హిందీలో ‘ఖూన్‌కార్’ టైటిల్‌తో డబ్ చేసి, యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే! ఇక అప్పటినుంచి ఇది వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది.

Samantha Ruth Prabhu: నాకు ఆ అవసరం లేదు.. తేల్చి చెప్పేసిన సమంత

మొదట్లో ఈ సినిమా అత్యంత వేగంగా 100, 200, 300 మిలియన్ వ్యూస్‌లను కొల్లగొట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా 500 మిలియన్ మార్క్‌ని దాటేసింది. ఇప్పుడు ఇది ఏకంగా 700 మిలియన్‌కు పైగా వ్యూస్ నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఈ ఒక్క సినిమా కూడా ఈ స్థాయిలో వ్యూవర్షిప్ రాబట్టిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ సినిమాగా ఇన్ని వ్యూస్ నమోదు చేసింది. దీంతో.. ఇది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన వరల్డ్ రికార్డ్ సాధించింది. అంతేకాదు.. నాలుగు మిలియన్‌కి పైగా లైక్స్‌ని కూడా ఇది సొంతం చేసుకుంది. ఇప్పటికీ మంచి వ్యూస్‌తో ఈ సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఇది మరిన్ని మైల్‌స్టోన్స్‌ని అందుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు.

Priyanka Chopra: వాటితో విసిగిపోయా, అందుకే గుడ్‌బై చెప్పా.. ప్రియాంకా షాకింగ్ కామెంట్స్

కాగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయక సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తరఫున రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ఇందులో జగపతి బాబు, శరత్ కుమార్, ధన్య బాలకృష్ణ, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. మరోవైపు.. చాలాకాలం నుంచి చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌కి సంబంధించి రీసెంట్‌గా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇదే సమయంలో మే 12వ తేదీన ఇది రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా! మరి, యూట్యూబ్‌లో వండర్స్ క్రియేట్ చేసిన ఈ హీరో, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదే జోరుని కొనసాగిస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Show comments