Site icon NTV Telugu

Pan India: నెక్స్ట్ వెయ్యి కోట్ల సినిమా సలార్ కాదు…

Salaar

Salaar

బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ సినిమాలు వెయ్యి కోట్లని రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాల తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమాగా నిలిచిన ‘పఠాన్’ మూవీ కూడా వెయ్యి కోట్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కంప్లీట్ రన్ లో 650-700 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది కానీ వెయ్యి కోట్లు టచ్ చేయడం అనేది కష్టమైన పని. ఇలాంటి సమయంలో నెక్స్ట్ వెయ్యి కోట్లు రాబట్టే సినిమా ఏది అంటే అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క మాట సలార్. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న సలార్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకే నెక్స్ట్ వెయ్యి కోట్ల బొమ్మ ఏది అనగానే పాన్ ఇండియా ఆడియన్స్ టక్ మని సలార్ అనేస్తున్నారు. సలార్ సినిమా కన్నా సరిగ్గా రెండు వారాల ముందు ఇంకో సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది.

ఈ మూవీకి కూడా వెయ్యి కోట్లని రాబట్టే సత్తా ఉంది. కోలీవుడ్ యంగ్ అండ్ మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. జవాన్ పై భారీ అంచనాలున్నాయి. పైగా పటాన్‌తో వెయ్యి కోట్లు కొల్లగొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్. ప్రస్తుతం జవాన్ సినిమాపై ఉన్న అంచనాలని బట్టి పఠాన్ సినిమా కలెక్షన్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. హైప్ కి కాస్త పాజిటివ్ టాక్ కూడా కలిస్తే జవాన్ సినిమా వెయ్యి కోట్లకిపైగానే రాబడుతుందని త్రాగే వర్గాలు అంచనా వేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నార్త్ ఆడియన్స్ కి చాలా బాగా తెలుసు. ఈసారి అది పాన్ ఇండియా ఆడియన్స్ అంతా తెలుసుకోబోతున్నారు. సో జవాన్ సినిమాతో పఠాన్ రికార్డులని తిరగరాసి.. సలార్ కంటే ముందే షారుఖ్ వెయ్యి కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు.

Exit mobile version