Site icon NTV Telugu

‘కేజీఎఫ్-2’ టార్గెట్ అవుతోందా ? భారీ క్లాష్ తో రణరంగమే !

KGF2

ఓమిక్రాన్ పెద్ద సినిమాల విడుదలకు పెద్ద అంతరాయమే కలిగించింది. గత రెండు నెలల్లో విడుదల కావలసిన పెద్ద సినిమాలు వాయిదా పడడమే కాదు మరో మూడు నెలల్లో రాబోతున్న ఇతర సినిమాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సోలోగా రావడమే సో బెటర్ అని భావిస్తున్న చిత్రాలకు కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదు. తాజా బజ్ ప్రకారం చూస్తే ‘కేజీఎఫ్-2’కు కూడా షాక్ తగిలేట్టుగానే కన్పిస్తోంది. మొదటి భాగం సర్ప్రైజ్ బ్లాక్‌బస్టర్ కాగా, ‘కేజీఎఫ్-2’ను ఏప్రిల్ 14న సోలో రిలీజ్ డేట్‌తో భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు రాఖీ భాయ్‌కి కొంత కంపెనీ లభించినట్లు కనిపిస్తోంది.

Read Also : ఆర్ఆర్ఆర్ : చరిత్ర వర్సెస్ ఫిక్షన్… క్లైమాక్స్ పై క్రేజీ బజ్ !!

‘కేజీఎఫ్-2’ టీం ఇతర చిత్రాలతో క్లాష్ అవ్వకుండా ఉండేందుకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. అయితే లాల్ సింగ్ చద్దా, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలు ఇప్పుడు ఏప్రిల్‌ వైపు చూస్తున్నాయి. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ ఏప్రిల్ 14న విడుదలవుతుండగా, తాజా వార్తల ప్రకారం తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘బీస్ట్’ కూడా అదే రోజు థియేటర్లలోకి రావడానికి ప్లాన్ చేస్తోంది.

ఈ చిత్రాలన్నింటి మధ్య ‘ఆర్ఆర్ఆర్’ కూడా మార్చి తేదీని మిస్ అయితే ఏప్రిల్ 28న విడుదల అవుతుంది. ఇదే జరిగితే ‘కేజీఎఫ్-2’కు తమిళనాడు, కేరళ, ఉత్తర భారతదేశంలో థియేటర్ల కొరత ఏర్పడుతుంది. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ విడుదలకు వెళితే ‘కేజీఎఫ్-2’కు కేవలం రెండు వారాల డ్రీమ్ రన్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ తరుణంలో ‘కేజీఎఫ్-2’ వెనక్కి తగ్గడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ 200 కోట్ల కంటే ఎక్కువ థియేట్రికల్ టార్గెట్ ఖచ్చితంగా అంత ఈజీ కాదు. మరి ‘కేజీఎఫ్-2’ నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version