Site icon NTV Telugu

Beast : ఆ హాలీవుడ్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యిందా?

Beast

Beast

దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్” ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇందులో విజయ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే “బీస్ట్” ట్రైలర్ ను చూసిన నెటిజన్లు ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీని పోలి ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2009లో విడుదలైన అమెరికన్ మూవీ “పాల్ బ్లార్ట్ : మాల్ కాప్” నుండి ప్రేరణ పొందిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ “బీస్ట్” కు “మాల్ కాప్‌”తో చాలా పోలికలు కన్పిస్తున్నాయి.

“మాల్ కాప్” మూవీ ఒక బిజీ షాపింగ్ మాల్ గురించి. దానిని నేరస్థుల ముఠా స్వాధీనం చేసుకుంటుంది. సౌమ్య ప్రవర్తన కలిగిన సెక్యూరిటీ గార్డు మాల్ లోని ప్రజలను రక్షించడానికి వస్తాడు. “బీస్ట్” విషయానికొస్తే విజయ్ మాల్ లోపల ఇరుక్కున్న సైనికుడు. అతను మాల్‌ను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో ఉంటాడు. రెండు సినిమాల ప్లాట్లు దాదాపుగా సేమ్ ఉండడంతో “మాల్ కాప్” నుంచి “బీస్ట్” స్టోరీ ఇన్స్పైర్ అయ్యిందనే చర్చ ఆన్‌లైన్ లో విస్తృతంగా జరుగుతోంది. కొంతమంది చేస్తున్న కాపీ ఆరోపణల మధ్య “బీస్ట్” మేకర్స్ ఇంకా స్పందించలేదు.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన “బీస్ట్‌”లో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని “అరబిక్ కుతు” సాంగ్ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version