కోలీవుడ్ అభిమానవులతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బీస్ట్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, హాట్ బ్యూటీ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ పోస్టర్స్ తో పాటు ఇటీవల బెస్ట్ ఫస్ట్ సింగిల్ అరబిక్ కుత్తు ప్రోమో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మరో విశేషమేంటంటే ఈ సాంగ్ లిరిక్స్ ని హీరో శివకార్తికేయన్ అందించడం. తాజాగా రిలీజైన అరబిక్ కుత్తు లిరికల్ వీడియో అదిరిపోయింది.
అరబిక్ స్టైల్లో సాంగ్ మొత్తం చాలా స్టైల్ గా ఉంది. ముఖ్యంగా విజయ్ అల్ట్రా స్టైలిష్ లుక్ వేరే లెవెల్.. లైట్ గా ట్రిమ్ చేసిన తెల్ల గడ్డం.. గాగుల్స్ తో కనిపించి మెప్పించాడు. ఇక పూజా అందాల గురించి అస్సలు చెప్పక్కర్లేదు. విజయ్ కి తగ్గట్టు అమ్మడి అండ చందాలతో స్టన్నింగ్ లుక్ తో పిచ్చెక్కించేసింది. ఇక అనిరుధ్ వాయిస్, జానీ మాస్టర్ స్టెప్పులతో సాంగ్ హై వోల్టేజ్ తెప్పిస్తుంది. ఇక మొత్తం అరబిక్ పదాలే కాకుండా అక్కడక్కడా తమిళ్ పదాలను రైమింగ్ లో వాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.
