Beast vs KGF : Chapter 2… సౌత్ అతిపెద్ద బాక్స్ ఆఫీస్ క్లాష్ కు రెడీ అవుతోంది. దక్షిణాదిలో రెండు భారీ చిత్రాలు కేవలం ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు భారీ సినిమాలు వేసవిలో పోటీ పడబోతున్నాయి. ఏప్రిల్ 13న ‘బీస్ట్’, ఏప్రిల్ 14న “కేజీఎఫ్ : చాప్టర్ 2” వస్తున్నట్టు రెండు సినిమాల మేకర్స్ ప్రకటించారు. అయితే ముందు నుంచీ సోలోగా రావాలని చూస్తున్న రాఖీభాయ్ కి ఇది కాస్త కష్టమే. అయితే విజయ్ కు ఇంకా దేశవ్యాప్తంగా అంటే పాన్ ఇండియా క్రేజ్ దక్కలేదు. కేవలం సౌత్ లో ముఖ్యంగా తమిళంలోనే ఇప్పటిదాకా స్టార్ హీరోగా సత్తా చాటుతూ వచ్చాడు. కోలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న అతికొద్ది మంది స్టార్ హీరోలలో విజయ్ ఒకరన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ స్ట్రెయిట్ గా టాలీవుడ్ లో సినిమా చేయకపోయినా తెలుగులోనూ ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
Read Also : RRR : రాజమౌళికి సినీ పరిశ్రమ సలామ్
ఇక యష్ విషయానికొస్తే… “కేజీఎఫ్” తెరపైకి వచ్చే వరకూ ఒక్క కన్నడ భాషలో తప్ప ఇతర భాషల్లో ఆయనెవరో తెలియదు. “కేజీఎఫ్” సృష్టించిన ప్రభంజనంతో రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. “కేజీఎఫ్-2″తో రాఖీ భాయ్ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తాడా ? అని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కరోనాతో పాటు పలు కారణాలతో పలుమార్లు సినిమాను వాయిదా వేసి, చివరకు ఏప్రిల్ 14న సోలోగా రావాలని అనుకున్న “కేజీఎఫ్-2” మేకర్స్ కు విజయ్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. రెండ్రోజుల ముందే ‘బీస్ట్’ ఏప్రిల్ 13న విడుదల అవుతుందని ప్రకటించగా, ఒక తమిళంలోనే సినిమా విడుదల ఉంటుందని, అది “కేజీఎఫ్-2″కు పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చని అనుకున్నారు అంతా. కానీ మేకర్స్ ఇప్పుడు సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుందని ప్రకటించారు. మొత్తానికి రాఖీ భాయ్ తో బిగ్గెస్ట్ క్లాష్ కు రెడీ గా ఉన్నాడు బీస్ట్. మరి ఈ రెండు సౌత్ బిగ్గెస్ట్ మూవీస్ లో ప్రేక్షకులు ఏ మూవీని ఆదరిస్తారో చూడాలి.
