టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఏది మాట్లాడిన సంచలనమే. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ మాట్లాడే స్పీచ్ లకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మైక్ అందుకున్నాడు అంటే ఎదో ఒక సంచలనం చేయాల్సిందే. గతంలో ఓ సినిమా ఈవెంట్ కు తనను పిలవలేదని త్రివిక్రమ్ ను అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ నుద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తాజాగా బండ్ల గణేష్ చేసిన మరోక ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ ట్వీట్ ఎవరినుద్దేసించి ఎవరికోసం వేసాడనేది క్లారిటీ లేదు.
బండ్ల గణేష్ ట్వీట్ లో ఏమ్మన్నారంటే..
అతను గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన నేపథ్యం గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన విద్య గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన విజయాల గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన వైఫల్యాల గురించి అబద్ధాలు చెబుతాడు
అబద్ధం చెబుతున్నాడని పట్టుబడినప్పుడు,
అబద్ధం గురించి కూడా అబద్ధం చెబుతాడు
అబద్ధాలకు సాక్ష్యం ఉన్నప్పుడు,
ఇతరులే అబద్ధం చెప్పారు అని చెబుతాడు
తర్వాత కొత్త అబద్ధాలకు వెళ్తాడు…మరి బండ్ల ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎవిరినుద్దేశించి అన్నారోనని డిస్కషన్ మొదలైంది.
Also Read : Kantara : కాంతార లో రిషబ్ శెట్టి భార్య నటించింది.. ఎక్కడో కనిపెట్టారా?
అతను గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన నేపథ్యం గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన విద్య గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన విజయాల గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన వైఫల్యాల గురించి అబద్ధాలు చెబుతాడు
అబద్ధం చెబుతున్నాడని…— BANDLA GANESH. (@ganeshbandla) October 5, 2025
