Site icon NTV Telugu

Bandla Ganesh: బండ్ల గణేష్ ను మోసం చేసింది ఎవరు..?

Bandla

Bandla

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా బండ్ల.. నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీయడం లేదు. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ.. ఎప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలకు గురి అవుతూ ఉంటాడు. ఇక ఈ మధ్య బండ్ల గణేష్ లో చాలా మార్పు వచ్చింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదో పోగొట్టుకున్నవాడిలా.. ఎవరో వదిలేసినవాడిలా కనిపిస్తున్నాడు. అందుకు కారణం ఆయన పెట్టే ట్వీట్స్. జీవితం గురించి, తల్లిదండ్రుల గురించి, ప్రకృతి, సంగీతం ఒకటి అని కాదు కానీ నిజం చెప్పాలంటే బ్రేకప్ అయిన కుర్రాడు పెట్టే ట్వీట్స్ పెట్టుకొస్తున్నాడు. తాజాగా మోసం గురించి ఒక రేంజ్ లో ట్వీట్ చేసుకొచ్చాడు బండ్లన్న.

Rashmi Gautham: బిగ్ బాస్ కు రష్మీ.. కానీ..?

“ప్రతిసారి మోసపోవు కదా మరెందుకు అలా కూలబడిపోయావు..? లే.. ఈసారి ఎవరిని నమ్మకు అలాగని అందరి మీద కక్షకట్టకు జీవితం కదా..! ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతాయి మరెన్నో నేర్పుతాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్లడమే ఆట..! గెలుస్తావా.. ఓడిపోతావా తర్వాత, కానీ ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ఉండు. నీ ఓపిక రేపటి భవిష్యత్తుకి బలం” అని ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ పై అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. అన్నా ఏమైంది అన్నా.. ఎవరు నిన్ను మోసం చేశారు.. ఎందుకు ఇలా అయిపోయావ్ అంటూ ఒకటే ప్రశ్నల వర్షం. ఒకప్పుడు పవన్ ను దేవుడు అన్న బండ్ల.. ఇప్పుడు దేవుడిలాంటి వ్యక్తి అని అంటున్నాడు. మాస్ మహారాజా రవితేజను పొగిడేస్తున్నాడు.. రాజకీయాలు, సినిమాలు, మెగా ఫ్యామిలీ ఇలా ఒక్కదాన్ని కూడా వదలకుండా ట్వీట్స్ చేస్తున్నాడు. అసలు బండ్లకు ఏమైంది అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Exit mobile version