Site icon NTV Telugu

Bandla Ganesh: పవన్ ను చూసి బుద్ది తెచ్చుకోండి.. కుర్ర హీరోలపై బండ్లన్న ఫైర్

Bandla

Bandla

Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు బండ్లన్న భక్తుడు అన్న సంగతి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవర అంటూ ఆయన స్పీచ్ మొదలుపెడితే పవన్ అభిమానులు చొక్కాలు చింపుకోవాల్సిందే. ఇక నిత్యం పవన్ జపం చేసే బండ్ల ఇటీవల కొంతకాలం వేదాంతి గా మారిన విషయం విదితమే. మనకు ఎవరు గొప్ప కాదు మన తల్లిదండ్రులే మనకు అన్నీ.. వారిని జాగ్రత్తగా  చూసుకోవాలి అని చెప్పుకొచ్చిన బండ్ల  గత కొన్నిరోజుల నుంచి యథావిధిగా పవన్ నామజపం చేస్తూనే ఉన్నాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో తనకు నచ్చని విషయంపై నిర్మొహమాటంగా ట్వీట్ చేసి ట్రోలింగ్ గురవుతున్న బండ్ల తాజాగా మరో ట్వీట్ తో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ కుర్ర హీరోల తీరుపై కొద్దిగా ఘాటుగానే స్పందించడంతో పాటు పవన్ ను చూసి నేర్చుకోమని సలహా ఇచ్చాడు.

విషయం ఏంటంటే.. టాలీవుడ్ యంగ్ హీరోలు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ ఒక ఈవెంట్ లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. ఆ ఫోటోను, దాంతో పాటు పెద్దల ముందు వినయంగా కూర్చున్న పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేస్తూ “నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం” అని చెప్పుకొచ్చాడు. ఒక  హోదా వచ్చిందని ఎగిరెగిరి పడకండని, కొద్దిగా సంస్కారం నేర్చుకోండంటూ క్లాస్ పీకాడు. ఇక ఈ ఫోటోలపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ మరి వీటి సంగతి ఏంటి  బండ్లన్న అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోలు ఎంతో క్యాజువల్ గా ఉండడానికి అలా కూర్చున్నారు తప్ప వారిలో అహంకారం లేదు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

https://twitter.com/ganeshbandla/status/1569724284423254016?s=20&t=xLAOPyj0V35MJDxS8XMwdw

Exit mobile version