Bandla Ganesh: పవన్ ను చూసి బుద్ది తెచ్చుకోండి.. కుర్ర హీరోలపై బండ్లన్న ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు బండ్లన్న భక్తుడు అన్న సంగతి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవర అంటూ ఆయన స్పీచ్ మొదలుపెడితే పవన్ అభిమానులు చొక్కాలు చింపుకోవాల్సిందే. ఇక నిత్యం పవన్ జపం చేసే బండ్ల ఇటీవల కొంతకాలం వేదాంతి గా మారిన విషయం విదితమే. మనకు ఎవరు గొప్ప కాదు మన తల్లిదండ్రులే మనకు అన్నీ.. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పుకొచ్చిన బండ్ల గత కొన్నిరోజుల నుంచి యథావిధిగా పవన్ నామజపం చేస్తూనే ఉన్నాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో తనకు నచ్చని విషయంపై నిర్మొహమాటంగా ట్వీట్ చేసి ట్రోలింగ్ గురవుతున్న బండ్ల తాజాగా మరో ట్వీట్ తో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ కుర్ర హీరోల తీరుపై కొద్దిగా ఘాటుగానే స్పందించడంతో పాటు పవన్ ను చూసి నేర్చుకోమని సలహా ఇచ్చాడు.
విషయం ఏంటంటే.. టాలీవుడ్ యంగ్ హీరోలు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ ఒక ఈవెంట్ లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. ఆ ఫోటోను, దాంతో పాటు పెద్దల ముందు వినయంగా కూర్చున్న పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేస్తూ “నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం” అని చెప్పుకొచ్చాడు. ఒక హోదా వచ్చిందని ఎగిరెగిరి పడకండని, కొద్దిగా సంస్కారం నేర్చుకోండంటూ క్లాస్ పీకాడు. ఇక ఈ ఫోటోలపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ మరి వీటి సంగతి ఏంటి బండ్లన్న అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోలు ఎంతో క్యాజువల్ గా ఉండడానికి అలా కూర్చున్నారు తప్ప వారిలో అహంకారం లేదు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
https://twitter.com/ganeshbandla/status/1569724284423254016?s=20&t=xLAOPyj0V35MJDxS8XMwdw
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?