NTV Telugu Site icon

Bandla Ganesh: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. వీడియో రిలీజ్ చేసిన బండ్లన్న

Pawan

Pawan

Bandla Ganesh: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కు బండ్ల ఎంత పెద్ద ఫ్యాన్.. కాదు కాదు ఎంత పెద్ద భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక ఆయన గురించిఎవరైనా తప్పుగా మాట్లాడితే బండ్ల గణేష్ తనదైన రీతిలో ఇచ్చిపడేస్తాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంత ఉత్కంఠగా మారాయో అందరు చూస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న సీఎం జగన్.. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మరోసారి మాట్లాడారు. పవన్ నివాసం హైదరాబాదులో ఉంటే, ఆయన ఇంట్లో ఇల్లాలు ప్రతి 3, 4 సంవత్సరాలకు మారిపోతూ ఉంటుంది. పవన్ భార్య ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్… తర్వాత ఎవరో ఆయనకే తెలియాలి అంటూ జగన్ ఘాటుగా మాట్లాడారు. ఇక ఈ వ్యాఖ్యలపై బండ్లన్న స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఇది అంటూ చెప్పుకొచ్చాడు. జగన్ అలా మాట్లాడం పద్దతి కాదని తెలిపాడు.

Esha Rebba : బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా కిర్రాక్ ఫోజులు..మాల్దీవుల్లో అందాలతో రచ్చ..

” అందరికీ నమస్కారం.. నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన.. ఒకటే బాధ.. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే.. నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది.. చిరాకు తెప్పిస్తోంది.. నిన్న సీఎం జగన్‌ గారు నాకు ఇష్టుడైన పవన్ కల్యాణ్ గారి గురించి కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. ఇవి నాకెంతో బాధ కలిగించాయి.. నేను కొన్ని దశాబ్దాల పాటు పవన్‌ కల్యాణ్‌ వెంట తిరిగాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా నిజాయితీ పరుడు, నీతిమంతుడు. ఎవరు ఎలాంటి కష్టంలో నేనున్నా అంటూ ముందుండి సాయ పడే భోళా మనిషి. ఇప్పుడు అలాంటి మనిషి గురించి మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జీవితంలో అందరికీ అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అవి కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే.. అని నేను భావిస్తున్నాను. పవన్‌ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడటం బాధగా ఉంది. మీకు విన్నవిస్తున్నాను.

Esha Rebba : బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా కిర్రాక్ ఫోజులు..మాల్దీవుల్లో అందాలతో రచ్చ..

పవన్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి.. దేశం కోసం బతికే మనిషి. ఆయన స్వార్థం కోసం కానీ, స్వలాభం కోసం ఏనాడు పని చేయలేదు. ఆయన హాయిగా షూటింగ్‌లు చేసుకుని సూపర్‌ స్టార్‌ హోదాతో హాయిగా బతకండని నేను తరచూ చెబుతుండే వాడిని. కానీ ఆయన జనాల కోసం ఏదో ఒకటి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అన్నిటినీ సహిస్తూ తలవంచుకుని జనం కోసం జీవిస్తున్నాడు. . రాత్రి, పగలు కష్టపడి.. సంపాదించిన డబ్బుని పార్టీకి, ప్రజలకు ధార పోస్తున్నాడు. ఆయనకు కులాభిమానం లేదు. అందరూ ఒక్కటే అని భావిస్తారు. ఒకవేళ ఆయనకే కులపిచ్చి ఉంటే నన్ను ఇంతలా ఆదరిస్తాడా? నన్నుఈ స్థాయికి తీసుకొస్తాడా? నేను ఈ రోజు అనుభవిస్తుందంతా కూడా పవన్‌ కల్యాణ్‌ పెట్టిన భిక్షే. ఆయన చాలా మంచి వ్యక్తి సార్‌. దయచేసి తెలిసీ తెలియకుండా ఆయన మీద అబాండాలు వేయకండి. నేను జన సేని మనిషిని, కార్యకర్తని ఏ మాత్రం కాదు. కేవలం ఆయనను ప్రేమించే వ్యక్తిని” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.