తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి.. అయిన సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ ఘాటు ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా తన వెకేషన్ నుంచి కొన్ని స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.. ఇటీవల వెకేషన్లు, టూర్లకు వెళ్తూ సందడి చేస్తున్న ఈషా రెబ్బా ఎప్పటికప్పుడు తన అభిమానులను ఫిదా చేస్తోంది. వెకేషన్ నుంచి గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఈషా తాజాగా పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.. ఇక లేటెస్ట్ పిక్స్ లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ టైట్ ఫిట్ లో అదరగొట్టింది. బిగుతైన డ్రెస్ లో అందాల ప్రదర్శన చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.. కిర్రాక్ పోజులతో మతులు పోగొడుతుంది..
ఈషా కెరీర్ ప్రారంభంలోనే మంచి దూకుడు మీద ఉంది.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఫుల్ స్వింగ్ లో ఉండేది. మంచి విజయాలే దక్కించుకుంటుంది. `అంతకు ముందు ఆ తర్వాత`, `అమితుమి` వంటి విజయాలు వరించాయి. ఆ తర్వాత కొన్ని మిశ్రమంగా ఆడాయి, మరికొన్ని ఆడలేదు.. తర్వాత కొంతకాలం ఖాళీగానే ఉంటుంది.. ఇక ఇప్పుడిప్పుడు అవకాశాలు రావడంతో మళ్ళీ బిజీ అవ్వనుంది… ప్రస్తుతం ఆమె ఓ సినిమా, మరో వెబ్ సిరీస్ చేస్తుంది. సుధీర్ బాబుతో `మామా మశ్చింద్రా`, జేడీ చక్రవర్తితో `దయా` అనే వెబ్ సిరీస్ చేసింది. అలాగే తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని అమ్మడు ఆశలు పెట్టుకుంది..