Site icon NTV Telugu

‘మా’ భవనం అత్యవసరం కాదు.. అది లేకుంటే ఇండస్ట్రీ ఆగిపోదు: బండ్ల

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డాడు. ‘మా’ అసోసియేషన్‌ లో సుమారు 900 మందిలో చాలా వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం, బిల్డింగ్‌ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే బాగుంటుందని బండ్ల తెలిపారు. ‘మా’కి బిల్డింగ్‌ అత్యవసరం కాదని, అది లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు.. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు అని బండ్ల గణేష్ కామెంట్‌ చేశారు. కాగా, ఈ ఏడాది ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనుండగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు బండ్ల గణేష్ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version