Site icon NTV Telugu

Bandla Ganesh: రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన బండ్ల గణేష్.. కారణం అదే!

Bandla Ganesh Politics

Bandla Ganesh Politics

Bandla Ganesh Says Good Bye To Politics: గడిచిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఎంత హంగామా చేశాడో అందరూ చూశారు. పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. తమ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, లేకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. అప్పట్లో ఆయన ఇచ్చిన ప్రతీ ఇంటర్వ్యూ, చేసిన ప్రతీ స్టేట్మెంట్ హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీనే డామినేట్ చేసేంత లెవెల్లో.. అప్పట్లో బండ్ల గణేష్ రచ్చ చేశాడు. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక, ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు బండ్ల. అప్పట్నుంచే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టాడు.

ఇప్పుడు తాను పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నానని బండ్ల గణేష్ ట్విటర్ మాధ్యమంగా ప్రకటించాడు. ‘‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల, నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల, వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. అంటే.. ఇకపై రాజకీయాల్లో బండ్ల ఎంటర్టైన్మెంట్ ఉండదన్నమాట!

Exit mobile version