Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్‌తో చిదంబరం మ్యాజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balan The Boy : కంటెంట్‌నే అసలైన స్టార్‌గా నమ్ముకునే మలయాళ చిత్ర పరిశ్రమ మరోసారి తన ప్రత్యేకతను నిరూపిస్తోంది. భారీ బడ్జెట్లు, స్టార్ హీరోల హంగామా లేకుండానే స్ట్రాంగ్ కంటెంట్ ను నమ్ముకుంటున్నారు అక్కడి దర్శకులు. దీంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకునే సినిమాలు అక్కడి నుంచి వరుసగా వస్తూనే ఉన్నాయి. అలాంటి చిత్రాల జాబితాలో ఇప్పుడు ‘బాలన్: ది బాయ్’ పేరు చేరింది. ‘జాన్ ఎ మ్యాన్’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. ఒక తల్లి, ఆమె కుమారుడి చుట్టూ రూపొందిన ఈ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ వసూళ్ల పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు చేస్తోంది.
సెప్టెంబర్ 19న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.1.82 కోట్ల నెట్ కలెక్షన్లతో సాధారణ ఓపెనింగ్ అందుకుంది. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రెండో రోజు నుంచి వసూళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విజయానికి కేరళ మార్కెట్ ప్రధాన బలంగా నిలిచింది. అక్కడ ప్రేక్షకులు సినిమాకు విశేష ఆదరణ చూపుతుండగా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన లభిస్తోంది. అంతేకాదు విదేశీ మార్కెట్లోనూ ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయంతో దర్శకుడు చిదంబరం వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్టేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ఫర్జానా పలాతింగల్, చందు సలీమ్‌కుమార్, టోవినో థామస్ తమ నటనతో ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రత్యేక ప్రదర్శనలో సినిమా చూసి చిత్రబృందాన్ని అభినందించగా, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ, ఇది భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన సినిమాగా అభివర్ణించినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. చిన్న కథతో పెద్ద విజయాన్ని ఎలా అందుకోవచ్చో మరోసారి నిరూపించిన చిత్రంగా బాలన్: ది బాయ్ నిలుస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
- Tags
- Balan The Boy
- cinema
తాజావార్తలు
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
-
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
-
Coolpad Cool X Wide: 50MP కెమెరా, 4600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం!
-
Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!