Site icon NTV Telugu

Akanda 2 : వెయ్యి మందితో బాలయ్య యాక్షన్ సీన్..?

Akanda2

Akanda2

Akanda 2 : సీనియర్ హీరో బాలకృష్ణ వరుస హిట్లతో మంచి జోష్‌ మీదున్నాడు. తనకు బాగా కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటితో ఇప్పుడు అఖండ-2లో నటిస్తున్నాడు. మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ షెడ్యూల్ ఇప్పటికే జార్జియాలో ముగిసిందని తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను వేసి అందులో యాక్షన్ సీన్ తీస్తున్నాడంట బోయపాటి. జూన్ మొదటివారంలో ఈ సెట్ లో ఏకంగా వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీన్ తీస్తున్నారంట. బోయపాటి దగ్గరుండి మరీ సెట్స్ వేయిస్తున్నట్టు సమాచారం.

Read Also : IPL 2025-RCB: ఆర్సీబీకి బిగ్ షాక్..18 వికెట్లు పడగొట్టిన స్టార్ పేసర్ అవుట్!

అఖండ మూవీ భారీ హిట్ కావడంతో.. రెండో పార్టుపై అంచనాలు బాగా ఉన్నాయి. ఇందులో బాలయ్య నాగసాధవుగా నటించనున్నాడు. ఇందులో ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సనాతన ధర్మాన్ని హైలెట్ చేస్తూ ఈ మూవీని తీయబోతున్నాడు బోయపాటి. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం మూవీ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Operation Sindoor: కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే ‘ప్రతీకారం’ తప్పదు.. భారత్ హెచ్చరిక!

Exit mobile version