టొక్యో పారాలింపిక్స్ విజేతలకు టాలీవుడ్ సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లు ఇప్పటికే విజేతల ప్రతిభను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ అభినందనలు తెలియచేశారు.
‘ టొక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క భారత క్రీడాకారులకు, విజేతలకు నా అభినందనలు, అంగవైకల్యాన్ని అధిగమించి తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో పతకాలను గెలవటమే కాకుండా కొత్త రికార్డ్స్ కుడా సృష్టించారు, మీరు కేవలం క్రీడాకారులే కాదు, అంగవైకల్యాన్ని శాపంగా భావించి బాధపడే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఆశాజ్యోతులు… ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను, మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ బాలయ్య సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
