Site icon NTV Telugu

ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ

Balakrishna-and-NTR

Balakrishna-and-NTR

నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”కు అన్ని చోట్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబి సినిమాస్‌ లో ‘అఖండ’ను వీక్షించింది. అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also : ‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ !

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ”సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చాలా హ్యాపీగా ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమాను అద్భుతంగా చెక్కారు. ఒకనాడు రామారావు బ్రతికించారు భక్తిని … నేడు ‘అఖండ’ బ్రతికించింది భక్తిని అని చెప్పుకోవడానికి గర్వంగా, సంతోషంగా ఉంది. సినిమాను ఇంత అఖండమైన హిట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు. తెలుగు వాళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. కొత్తదనాన్ని వాళ్ళు ఎప్పుడూ ఆదరిస్తారు అన్నదానికి నిదర్శనం ‘అఖండ’. ఇంటర్వెల్‌లో చిన్న చిన్న పిల్లలు సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుకోవడం చూసి సంతోషించాను. ‘అఖండ’ విజయం పరిశ్రమ విజయం. ఆధ్యాత్మికత గురించి తెలియని ఎన్నో నిజాలను ‘అఖండ’ వెల్లడిస్తుంది. రకరకాల పనుల్లో బిజీగా ఉండడంతో ఇప్పుడే సినిమా చూశాను. తెరపై నా నటన చూసి నేను కూడా కాస్త ఆశ్చర్యపోయాను. థమన్ తన రీరికార్డింగ్‌ తో సినిమాకు ప్రాణం పోశాడు. సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. నేను దర్శకుడి ఆర్టిస్ట్‌ని. నేను కేవలం నా దర్శకుడి సూచనలను పాటిస్తాను. నాకు ప్రతి సినిమా సమానమే” అని అన్నారు.

బోయపాటి మాట్లాడుతూ ”అఖండ సూపర్ డూపర్ హిట్ అని అందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు. ఈ చిత్రం సెకండ్ వేవ్ తర్వాత వచ్చింది. చాలా కాలం తర్వాత సినిమా థియేటర్‌లో భారీ వేడుకలు చూశాను. ఈ అఖండ విజయం ఇండస్ట్రీ విజయం” అని అన్నారు.

Exit mobile version