NTV Telugu Site icon

Spy: స్పై మూవీలో బాలయ్య.. మాములుగా ఉండదు మరి

Bala

Bala

Spy: యంగ్ హీరో నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్పై. ఈ చిత్రం జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం పాన్ ఇండియా లెవెల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. స్పై సినిమాలో బాలయ్య ఉన్నాడట. ఏంటి నిజమా.. అంటే ఒకరకంగా నిజమే అని చెప్పాలి. ఈ నిఖిల్.. ఈ చిత్రంలో స్పై గా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ స్పై టీమ్ లో ఒక వ్యక్తి బాలయ్య బాబుకు పిచ్చ ఫ్యాన్ గా నటిస్తున్నాడట. అతడు మాట్లాడే తీరు, విధానం అన్ని బాలయ్యలానే ఉంటాయట.

Ee Nagaraniki Emaindi: రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది గా..

బాలయ్య సినిమాల రిఫరెన్స్ లు కూడా ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అసెంబుల్ అవుతున్నారు. జై బాలయ్య అనే నినాదాలు కూడా ఇందులో ఉన్నాయని.. అవన్నీ చాలా ఫన్ ను క్రియేట్ చేయనున్నాయట. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ ను రివీల్ చేసే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిఖిల కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా స్పై తెరకెక్కనుంది. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments