Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Balakrishna Chief Guest For Indian Idol

Telugu Indian Idol: ‘అన్ స్టాపబుల్’ బాలకృష్ణతో టాప్ 6!

Published Date :May 29, 2022 , 10:29 pm
By NTV WebDesk
Telugu Indian Idol: ‘అన్ స్టాపబుల్’ బాలకృష్ణతో టాప్ 6!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు ఇండియన్ ఐడల్ షో చివరి దశకు చేరుకుంది. ‘రేస్ టు ఫినాలే’లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వాగ్దేవి, వైష్ణవి, లాలస, ప్రణతి, ధరిమిశెట్టి శ్రీనివాస్, జయంత్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. అన్నపూర్ట స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆదివారం రేస్ టు ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ ఎపిసోడ్ కు గెస్ట్ గా మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో యువతను ఊపేసిన ఉషా ఊతప్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

టాప్ 6 సింగర్స్ లో అన్ స్టాపబుల్ ఎపిసోడ్!
తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు కావడం విశేషం. మహానటుడు, నటరత్న నందమూరి తారకరామారావు శతజయంతి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఎపిసోడ్ లో ఎన్టీయార్ పాటలకు ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం ఉదయం చిలకలూరి పేటలో ‘అఖండ’ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు హాజరైన బాలకృష్ణ, అక్కడ నుండి నేరుగా తెలుగు ఇండియన్ ఐడల్ సెమీ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”’ఆహా’ సంస్థ మొదటిసారి తెలుగులో ఇండియన్ ఐడల్ ను నిర్వహిస్తోంది. ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ షోను చూస్తున్నాను. కంటెస్టెంట్స్ బాగా పాడుతున్నారు. సెమీ ఫైనల్స్ కదా… కొందరు షివరింగ్ అవుతున్నట్టు తెలిసింది. వారిని సెట్ చేద్దామని నేనొచ్చాను” అని అన్నారు. ఈ ఎపిసోడ్ లోనే బాలకృష్ణ తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.

లైఫ్‌ టైమ్‌ ఎక్స్ పీరియన్స్!
వేలాది మంది హాజరైన తెలుగు ఇండియన్ ఐడల్ లో టాప్ సిక్స్ పొజిషన్ కు చేరుకోవడం పట్ల కంటెస్టెంట్స్ వాగ్దేవి, వైష్ణవి, లాలస, ప్రణతి, శ్రీనివాస్, జయంత్ హర్షం వ్యక్తం చేశారు. సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ రావడం ఆనందంగా ఉందన్నారు. అలానే చాలా హోమ్లీ ఎట్మాస్ఫియర్ లో తెలుగు ఇండియన్ ఐడిల్ జరగడం పట్ల న్యాయనిర్ణేతలు తమన్, కార్తీక్, నిత్యా మీనన్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘ఎన్టీయార్ కథానాయకుడు’ మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ గారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని నిత్యా మీనన్ తెలిపింది. తొలిసారి హోస్ట్ గా చేస్తున్న తాను ఈ మొత్తం ప్రక్రియను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని సింగర్ శ్రీరామచంద్ర చెప్పాడు.

Whatsapp Image 2022 05 29 At 8.15.10 Pm

గ్రాండ్‌ ఫినాలేకు గెస్ట్‌గా మెగాస్టార్!
తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు కంటెస్టెంట్స్ తో పలు దఫాలుగా ఈ ఎపిసోడ్ జరుగనుంది. అందులో తొలుత ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆ తర్వాత టాప్ త్రీ కంటెస్టెంట్స్ మధ్య పోటీని నిర్వహిస్తారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ కు చిరంజీవితో పాటు ఆయన సరసన హీరోయిన్లుగా నటించిన ఐదుగురు అందాల కథానాయికలు సైతం ఈ గ్రాండ్‌ ఫినాలేలో పాల్గొంటారని అంటున్నారు. మొత్తం మీద మరో మూడు వారాల్లో తెలుగు ఇండియన్ ఐడల్ విజేత ఎవరు అనేది తెలిసిపోతుంది!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna Indian Idol
  • Indian Idol Top 6
  • megastar chiranjeevi
  • telugu indian idol
  • Tollywood

తాజావార్తలు

  • US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions