Site icon NTV Telugu

సెంటిమెంటును బ్రేక్ చేసిన బాలయ్య

akhanda

akhanda

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “అఖండ” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సెంటిమెంట్ ను బాగా నమ్మే బాలయ్య ఈసారి మాత్రం ‘అఖండ’కు సంబంధించి ఓ సెంటిమెంటును బ్రేక్ చేశారు.

Read Also : బాక్స్ ఆఫీస్ పై ‘అఖండ’ దండయాత్ర… ఒక్కరోజులోనే చరణ్ రికార్డు బ్రేక్

తన సినిమా ఏదైనా విడుదలైనప్పుడు బాలయ్య చిత్ర బృందంతో కలిసి తరచుగా హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్లో ఫస్ట్ షోను వీక్షిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఆయన ‘అఖండ’ను చూడడానికి థియేటర్ కు వెళ్ళలేదు. ఈరోజు ఉదయం నుంచి ‘అఖండ’ ప్రభంజనం కొనసాగుతోంది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇతరులతో కలిసి భ్రమరాంబ థియేటర్లో సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన ప్రేక్షకుల నుంచి వస్తున్న భారీ స్పందనను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అయితే అక్కడికి బాలయ్య వస్తాడని ఊహించిన అభిమానులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురయ్యింది. అయినప్పటికీ బాలయ్య చేతికి సర్జరీ జరగడం కారణంగానో, లేదంటే బిజీగా ఉండడం వల్లనో రాలేకపోయి ఉంటారని సర్ది చెప్పుకుంటున్నారు నందమూరి అభిమానులు.

Read Also : బాలయ్య ఫ్యాన్స్ కు షాక్… ‘అఖండ’ షో ఆపేసిన పోలీసులు

ఇక సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమా ఎప్పుడు వచ్చినా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. సినిమా రిలీజ్ రోజు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసి, పాలాభిషేకం, పోస్టర్ల ముందు కొబ్బరికాయలు కొట్టడం వంటి పనులు చేస్తుంటారు. అయితే ఆ పండగ వాతావరణం ఇప్పుడు ‘అఖండ’ విషయంలో కన్పిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం ‘అఖండ’ మేనియా కొనసాగుతోంది. తారలు మారినా సినిమా థియేటర్ల వద్ద ఆయన తెచ్చే పండగ మారదు అంటూ బాలయ్యను ఆకాశానికెత్తేస్తున్నారు ఆయన అభిమానులు.

Exit mobile version