Site icon NTV Telugu

Balayya – Boyapati Film: అఖండ 2 కాదు.. పొలిటికల్ వార్?

Balayya Boyapati Film

Balayya Boyapati Film

Balakrishna Boayapati Movie Will Be A Political Backdrop: ‘అఖండ’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించినప్పుడే.. తమ కాంబోలో మరో సినిమా తప్పకుండా ఉంటుందని, అది ‘అఖండ’కి సీక్వెల్ అని దర్శకుడు బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. ఇక ఈమధ్య వీరి కాంబోపై మరిన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తాము కమిట్ అయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, వెంటనే తమ కాంబోలో సెట్స్ మీదకి వెళ్లాలని వాళ్లు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని.. అఫీషియల్‌గా ప్రాజెక్ట్‌ని ప్రకటించనున్నారని, ఆరోజే ప్రారంభోత్సవం కూడా ఉండదని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ గుప్పుమంది. వీరి కాంబోలో రాబోయే సినిమా అఖండ సీక్వెల్ కాదని, పొలిటికల్ వార్ నేపథ్యంలో ఉండదనుందని ఆ గాసిప్ సారాంశం.

Sobhita Dhulipala: నాగచైతన్య ఎఫైర్.. శోభితా షాకింగ్ రియాక్షన్

రాజకీయ నేపథ్యాల్ని హ్యాండిల్ చేయడంలో బోయపాటి దిట్ట. ఇప్పటికే బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాల్లో.. పూర్తిస్థాయిలో కాకపోయినా, కొంత పాలిటిక్స్ నేపథ్యమైతే ఉంది. అయితే.. ఈసారి పూర్తిస్థాయిలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా తీయాలని బాలయ్య, బోయపాటి నిర్ణయించినట్టు తెలిసింది. ఏపీలోని ప్రస్తుత రాజకీయాల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని, 2024 ఎన్నికలను ముందు దీనిని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్యాక్‌డ్రాప్ ఏదైనా.. అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో సినిమా రానుండటంతో, ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబోలో వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడేసుకుంది కాబట్టి, ఈసారి అంతకుమించి విధ్వంసం ఉంటుందని అభిమాననులు ఆశిస్తున్నారు.

Ranbir Kapoor: బాలీవుడ్‌పై రణ్‌బీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఏకిపారేశాడుగా!

కాగా.. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇందులో యువ నటి శ్రీలీల ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో బాలయ్య సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. మరోవైపు.. బోయపాటి ప్రెజెంట్ రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు కొనసాగుతున్నాయి. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయాల్సి ఉంది.

Exit mobile version