NTV Telugu Site icon

Balakrishna: ‘స్వామి రామానుజాచార్య’గా బాలకృష్ణ!?

Balayya Swami Rajanujachary

Balayya Swami Rajanujachary

Balakrishna As Swami Ramanujacharya: ప్రస్తుతం టాలీవుడ్ లో పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలు చేయాలంటే మనముందున్న ఓన్లీ ఆప్షన్ నందమూరి బాలకృష్ణ. సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’గా రాబోతున్న బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆరంభించారు. ఇప్పటికే కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలను చేశారు. ఇప్పడు తాత్విక వేత్త ‘స్వామి రామానుజాచార్య’గా బాలకృష్ణను మలచటానికి నిర్మాత సి. కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎన్టీవీ ఇంటర్వ్యూలోనే ఈ విషయాన్ని స్పష్టం చేశారాయన. బాలకృష్ణ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ ఆరంభించటానికి సిద్ధమని కూడా అన్నారు.

Maxresdefault

జీవితమంతా శ్రీ వైష్ణవాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్య బయోపిక్ ను బాలకృష్ణతో తీయాలన్నది తన అభిమతమని మరోసారి స్పష్టం చేశాడు సి. కళ్యాణ్. ఇంతకు ముందు బాలకృష్ణతో ‘పరమ వీర చక్ర, రూలర్, జైసింహా’ వంటి చిత్రాలను నిర్మించి ఉన్నారు సి.కళ్యాణ్. ఇక ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి సహాయసహకారాలు కూడా ఉంటాయని టాక్. మరి సి. కళ్యాణ్ కోరికను బాలకృష్ణ నెరవేరుస్తారా!? ‘స్వామి రామానుజాచార్య’గా వెండితెరపై మెరుస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సి.

Balakrishna Again Confirms Movie On Ramanujas Biopic B 2801180143