Site icon NTV Telugu

Nandamuri Balakrishna: త్వరలో సీఎంగా కనిపించబోతున్న బాలకృష్ణ..?

Nbk

Nbk

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ త్వరలో సీఎం కానున్నారు.. ఏంటి నిజమా..? అంటే నిజమే కానీ రియల్ గా రీల్ లో.. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారిన బాలకృష్ణ మరో సినిమాను లైన్లో పెట్టాడు. మహేష్ తో కలిసి సర్కారు వారి పాట సినిమా తీసిన పరుశురామ్ తన తదుపరి సినిమా బాలయ్యతో ఉండనున్నదని టాక్ నడుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ కథను రాసుకున్నాడట పరుశురామ్. ఇక ఈ చిత్రంలో బాలయ్య సీఎం గా కనిపించనున్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఇప్పటికే బాలయ్య ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

అభిమానులకు కూడా బాలయ్య హీరోగానే కాకుండా పొలిటీషియన్ గా కూడా సుపరిచితుడే. దీంతో ఈ పాత్రకు అభిమానులు త్వరగా కనెక్ట్ అవుతారు అని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం కొద్దిగా సమయం పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య చేతిలో వరుస ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. వీరసింహారెడ్డి ని పూర్తిచేసి ఇటీవలే అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టాడు. దీని తరువాత తన స్వీయ డైరెక్షన్ లో ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా చేయాలని చూస్తున్నారు బాలయ్య బాబు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని సమాచారం. ఇవన్నీ పూర్తీ అయ్యాక కానీ, పరుశురామ్ తో సినిమా పట్టాలెక్కదు. మరి వచ్చే ఏడాది ఏమైనా పరుశురామ్ ఛాన్స్ అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version