దీపికా పదుకొణే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఏంటా న్యూస్ అనే క్యురియాసిటి కలుగుతోందా. అయితే ఆగండి. ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని కల్కి బ్యూటీ. నెక్ట్స్ ఇయర్ కూడా కనిపించే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే వన్ ఇయర్ నుండి మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తోన్న దీపికా ఇప్పుడే మళ్లీ మేకప్ వేసుకోబోతుంది. అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్టుకు షిఫ్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ వంద రోజులు కేటాయించిందని సమాచారం.…