NTV Telugu Site icon

Deverakonda Brothers: దేవరకొండలిద్దరికీ “బేబీ” బాగా కలిసొచ్చిందే!

Baby Worked Out For Deverakonda Brothers

Baby Worked Out For Deverakonda Brothers

Baby word sentiment worked for vijay and anand deverakonda: తెలుగు సినీ పరిశ్రమంలో ఉన్న సెంటిమెంట్లు ఇంకెక్కడ, ఉండవేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా ముహూర్తాలు ఫిక్స్ చేయడం మొదలు ప్రతి చిన్న విషయాల్లో సెంటిమెంట్ ఫీల్ అవుతూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంటే విజయ్ దేవరకొండ తమ్ముడికి కూడా వర్కౌట్ అయిందనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఈ లాజిక్ విన్న తర్వాత మీకు కూడా కరెక్టేనేమో అనిపిస్తుంది స్టోరీ మొత్తం చదివేయండి. అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ అనే కుర్రాడు ఎప్పుడో రవిబాబు డైరెక్టు చేసిన నువ్విలా అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. తండ్రి సీరియల్స్ డైరెక్ట్ చేసే వ్యక్తిగా సినీ పరిశ్రమలో కొంతమందికి తెలుసు, కొందరు దర్శకులతో కూడా పరిచయాలు ఉన్నాయి. అయినా ఆయన తన సొంత ప్రయత్నాలతో ఎలాగోలా పెళ్లి చూపులు అనే సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కానీ మంచి గుర్తింపు అయితే రాలేదు. విజయ్ దేవరకొండ అనే హీరో లాంచ్ అయ్యాడు, మంచి సినిమా చేశాడు అనుకున్నారు కానీ యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఇక అప్పటికే చేసిన ద్వారక అనే సినిమా రిలీజ్ అయింది గానీ అది రిలీజ్ అయ్యి వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు.

RX 100- Baby Movies: అమ్మాయిని బ్యాడ్ చేసి చూడు.. నెత్తిన పెట్టేసుకుంటారు గురూ!

అయితే ఎప్పుడైతే అర్జున్ రెడ్డి అనే సినిమా చేశాడో ఒక్కసారిగా ప్రేక్షకులు అందరిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ప్రియురాలి పాత్ర అంటే శాలిని పాండే పోషించిన ప్రీతి పాత్ర అర్జున్ రెడ్డిని బేబీ అని ప్రస్తావిస్తూ ఉండేది. నిజానికి అప్పట్లో ఈ పదం ఒక సెన్సేషన్ అయిపోయింది. ప్రేమికులందరూ అప్పటివరకు బుజ్జి, బంగారం అని పిలుచుకునే వాళ్ళు సైతం తమ తమ ప్రియుడిని లేదా ప్రియురాలిని బేబీ అంటూ సంభోదించడం మొదలుపెట్టారు. ఈ విషయం దాదాపుగా అప్పట్లో ప్రేమలో ఉండి, పిలుచుకున్న వారందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పదం విజయ్ దేవరకొండకు బాగా కలిసి వచ్చింది. అందుకే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని ఇప్పుడు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారు కొంత మంది. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతో మంచి నటుడు అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం ఆ తర్వాత చేసిన పుష్పక విమానం సినిమా పెద్దగా ఆడక పోవడంతో సరైన హిట్ కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయనకు అలాంటి హిట్ బేబీ అనే సినిమాతో దొరికింది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్లు హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బేబీ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు కొబ్బరిమట్ట, హృదయ కాలేయం సినిమాల డైరెక్టర్ సాయి రాజేష్. మారుతి ఎస్కేఎన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ అందుకుంటుంది, ఎలా అయితే విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి సినిమాలో బేబీ అనే పదం కలిసి వచ్చిందో ఇక ఈ బేబీ అనే టైటిల్ ఆనంద్ దేవరకొండకు అలా కలిసి వచ్చిందని అందుకే ఆయన నటించిన రెండు సినిమాలు పూర్తి థియేట్రికల్ రన్ లో ఎన్ని కోట్లు సంపాదించాయో ఈ సినిమా మొదటి రోజు అన్ని కోట్లు సంపాదించిందని అంటున్నారు. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు ఈ సినిమా రాబట్టగా మూడో రోజు ఇంకా ఎక్కువ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద దేవరకొండలు ఇద్దరికీ బేబీ అనే పదం బాగా కలిసి వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ బేబీ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళకి హిట్లు లభిస్తాయి అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.