జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ జనరేషన్‌కు యూత్‌కి పర్ఫెక్ట్ సినిమా… అనే రివ్యూస్ అందుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆర్ ఎక్స్ 100 తర్వాత యూత్‌ని అట్రాక్ట్ చేసిన సినిమాగా బేబీ ఉందంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దాంతో అమలాపురం టు అమెరికా వరకు ఓపెనింగ్స్ అదరగొట్టేసింది. ఒక్క అమెరికాలోనే ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకు కలిపి 1 లక్ష 50 వేల డాలర్స్ మార్క్‌ని క్రాస్ చేసేసింది.
Read Also: Tamannaah Bhatia: బటన్స్ విప్పేసి.. హాట్ పోజులిచ్చిన తమన్నా భాటియా!
ఇక ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 3.48 కోట్ల షేర్, 7.10 కోట్లు గ్రాస్ రాబట్టింది. 7.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బేబి.. మరో నాలుగు కోట్లకు పైగా షేర్ రాబడితే టార్గెట్ రీచ్ అయినట్టే. ప్రజెంట్ బేబీ క్రేజ్ చూస్తుంటే… ఈ టార్గెట్ రీచ్ అవడం చాలా ఈజీ అని చెప్పొచ్చు. వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి బేబీ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిన ‘బేబి’.. అతని కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోనుంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబుకీ రోల్ ప్లే చేశారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది.