Babu Mohan: 15 సినిమాల్లో నటిస్తున్నా.. డ్యాన్స్‌లు కూడా చేశా.. బాబు మోహన్ ఆసక్తికర విషయాలు!
- శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి బాబు మోహన్
- తిరుమలలో మీడియాతో మాట్లాడిన బాబు మోహన్
- 15 సినిమాల్లో నటిస్తున్నా, డ్యాన్స్‌లు కూడా చేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babu Mohan Reveals He Is Acting in 15 Movies: ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దార్చుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీర్వచనాలను అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాబు మోహన్.. తన సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం తాను 15 సినిమాల్లో నటిస్తున్నానని బాబు మోహన్ తెలిపారు. ‘ఇప్పుడు నేను 15 సినిమాల్లో నటిస్తున్నా. అందులో 8 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాల్లో కనీసం ఐదు చిత్రాలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి. ఆ నమ్మకం నాకుంది. కథలకు ప్రాధాన్యత ఉన్న, గౌరవప్రదమైన పాత్రలు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని బాబు మోహన్ చెప్పారు. ఇటీవలి కాలంలో తనకు మంచి పాత్రలు వస్తున్నాయని పేర్కొన్న బాబు మోహన్.. దర్శకుడు కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న సినిమాలో డ్యాన్స్‌లు కూడా చేశానని చెప్పారు. వయసు పెరిగినా ప్రేక్షకులను అలరించేలా శక్తివంచన లేకుండా నటిస్తున్నానని ఆయన తెలిపారు.
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
సినీ పరిశ్రమలో తన ప్రయాణం 41 సంవత్సరాలు పూర్తయ్యిందని బాబు మోహన్ గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి నటన అంటే తనకు అపారమైన ప్రేమ అని చెప్పారు. ‘చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. నా ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. ప్రేక్షకుల ఆదరణే నాకు అతిపెద్ద బలం. అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలతోనే ఇంతకాలం సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించగలిగా’ అని బాబు మోహన్ భావోద్వేగం చెందారు.
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!